పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఓడిపోయిన అభ్యర్థి వర్గీయులు గెలిచిన అభ్యర్థి మద్దతుదారులపై దాడులకు పాల్పడిన ఘటనలు కలకలం రేపాయి. సంతబొమ్మాళి మండలం భావనపాడులో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. భావనపాడు పంచాయతీకి వైకాపా తరపున ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు.
మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవగా... ప్రత్యర్థి అయిన గురువులు అనుచరులు వీరంగం సృష్టించారు. కొత్తపేట, మధ్యపేట గ్రామాల్లోని పలువురి ఇంటిపై దాడి చేశారు. చేతికి దొరికిన వస్తువుల్ని ధ్వంసం చేశారు. బాధితులు నౌపడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్కలి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఘటనకు బాధ్యత వహించాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
ఇదీ చదవండి: