ప్రజల చెంతకు పాలనను తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలన ప్రజల దగ్గరకు వచ్చిందని వివరించారు. ఈ ప్రభుత్వానికి కొన్ని భాద్యతలు ఉన్నాయని, అవి జగన్మోహన్‌రెడ్డి నిర్వర్తిస్తున్నారని చెప్పారు. రాజధాని ద్వారా పాలన వికేంద్రీకరణ చేసి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించే లక్ష్యాన్ని అందరూ స్వాగతిస్తున్నారని సభాపతి పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే 3 రాజధానులను జీఎన్ రావు కమిటీ ప్రతిపాదించిందన్న సభాపతి... ఈ నివేదిక చట్టసభల్లో అమోదం పొందాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి