బ్లీచింగ్ పౌడర్ అడిగినందుకు గ్రామ వాలంటీరు దుర్భాషలాడి తమను పోలీసులతో కొట్టించారని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బజారు వీధి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీరు తీరును నిరసిస్తూ రహదారిపై ఆందోళనకు దిగారు. కరోనా వ్యాధి వ్యాప్తి భయంతో తమ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లాలని కోరితే వాలంటీరు పట్టించుకోలేదని అన్నారు. గట్టిగా నిలదీస్తే.. దురుసుగా మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశారని గ్రామస్థులు వాపోయారు. పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను స్టేషన్కు తీసుకెళ్లి కొట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఈ వాలంటీరు వద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: