దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా.. శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలి వద్ద ఆశావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా... రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. రైతు మనుగడను దెబ్బతీసే మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: