శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం క్వారంటైన్ కేంద్రంలో ఆర్మీ ఉద్యోగులు నిరసన చేశారు. ఇక్కడ 80 మంది ఆర్మీ ఉద్యోగుల్ని ఈనెల 1వ తేదీ నుంచి క్వారంటైన్ లో ఉంచారు. ఎనిమిది నెలల తరువాత తాము సెలవుపై స్వస్థలాలకు వస్తే క్వారంటైన్ కేంద్రానికి తరలించారని, కరోనా పరీక్షలు జరిపినా ఫలితాలు వెల్లడించకుండా ఇంకా కేంద్రంలోనే ఉంచేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
కేంద్రం బయట బైఠాయించి నిరసన తెలిపారు. తమకు ఇస్తున్న భోజనం బాగలేదని, కనీస పారిశుద్ధ్య చర్యలు కూడా లేవని చెప్పారు. నెల రోజుల సెలవులో కుటుంబసభ్యులను చూడకుండానే 11 రోజులు గడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇళ్లకు పంపాలని, హోమ్ క్వారంటైన్లోనే ఉంటామని చెబుతున్నారు.
ఇదీ చూడండి