వ్యవసాయం దండుగ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే.. అదే వ్యవసాయాన్ని సీఎం జగన్ పండుగలా మార్చారని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్ ప్రారంభించారు.
పొందూరు పంచాయతీ పరిధిలోని హాస్పిటల్ వీధిలో ఇటీవల పనులు పూర్తి చేసిన సీసీ రోడ్ను ప్రారంభించారు. లైదం గ్రామంలో రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు రూ. 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రానికి, రూ. 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేశారు. జగనన్న కాలనీ లో ఉమ్మడి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి:
DEPUTY CM: 'చేనేత కుటుంబాలు ఆర్థికంగా బలపడాలనే నేతన్న నేస్తం'