ETV Bharat / state

మత్స్యకారుల హడావుడి.. నరసన్నపేటవాసుల్లో ఆందోళన

గుజరాత్ నుంచి రాష్ట్రానికి వచ్చిన మత్స్యకారులు పునరావాస కేంద్రాలు వీడి విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నారు. వారి తీరుతో నరసన్నపేట ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

gujrath migrants coming from quarantine
గుజరాత్ మత్స్యకారులు హడావుడిగుజరాత్ మత్స్యకారులు హడావుడి
author img

By

Published : May 4, 2020, 12:55 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారుల తీరుపై... స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌ నుంచి శనివారం నరసన్నపేటకు చేరుకున్న 414 మంది మత్స్యకారులను.. 4 పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరందరికీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలతో పాటు క్లారెట్‌ స్కూలు, తామరాపల్లి సమీపంలోని మహిళా జూనియర్‌ గురుకుల కళాశాలల్లో పునరావాసం కల్పించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పునరావాస కేంద్రాల్లో ఉన్న వందలాదిమంది వలస కార్మికులు నరసన్నపేట వీధుల్లో సంచరించారు. అది చూసి.. అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డిగ్రీ కళాశాల భవనం పైకప్పుపై విన్యాసాలు చేస్తుండడం వంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు.

అయితే... అధికారుల ఆదేశాలు సైతం లెక్క చేయకుండా వారందరూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు పెరుగుతున్నాయి. వీరందరూ తరచూ భోజన తదితర సదుపాయాలపై నిలదీస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నరసన్నపేట నడిబొడ్డున గుజరాత్‌ నుంచి వచ్చిన వలస కార్మికులకు ఎలా పునరావాసం కల్పించారని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు.

41 మంది తరలింపు..

నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పునరావాసం పొందుతున్న 41 మంది వలస కార్మికులను ఆదివారం సాయంత్రం యుద్ధ .ప్రాతిపదికన తామరాపల్లి సమీపంలోని మహిళా గురుకుల కళాశాల కేంద్రానికి తరలించారు. ముందుగా తాము వెళ్లేది లేదని వలస కార్మికులు తేల్చి చెప్పగా, అధికారులు సముదాయించి తరలించారు.

ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రంలో 149 మంది, క్లారెట్‌స్కూలు పునరావాస కేంద్రంలో 149 మందితో పాటు తామరాపల్లి మహిళా గురుకుల కళాశాల పునరావాస కేంద్రంలో 116 మంది వలస కార్మికులకు పునరావాసం కల్పించారు. వలస కార్మికులకు పూర్తి సదుపాయాలను కల్పిస్తున్నామని, నరసన్నపేటలోని రెండు కళాశాల కేంద్రాల్లో ఉన్న కార్మికులు సహకరించడం లేదని తహసీల్దార్‌ ప్రవల్లిక ప్రియ ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్ ఎఫెక్ట్: నిండు గర్భిణి 115 కి.మీ. నడక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.