శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఐసీడీఎస్ పీవో తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పోపుల బిల్లులు, కూరగాయల బిల్లుల చెల్లింపులో కోత విధిస్తున్నారని, గ్యాస్ సిలెండర్ లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. నెలవారీ సమావేశాలు నిర్వహించటం లేదని, కేంద్రాల అద్దెలు సైతం చెల్లించటం లేదన్నారు. పీవో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు.
ఐసీడీఎస్ పీవో తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తల ర్యాలీ
ఐసీడీఎస్ పీవో తీరు సరిగా లేదని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో బిల్లుల చెల్లింపుల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఐసీడీఎస్ పీవో తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పోపుల బిల్లులు, కూరగాయల బిల్లుల చెల్లింపులో కోత విధిస్తున్నారని, గ్యాస్ సిలెండర్ లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. నెలవారీ సమావేశాలు నిర్వహించటం లేదని, కేంద్రాల అద్దెలు సైతం చెల్లించటం లేదన్నారు. పీవో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు.
contributor: arif, jmd
note: ఈ వార్త కు సంబంధించిన కొన్ని విజువల్స్ AP_CDP_36_01_SOLAR_DHWAMSAM_AV_C6
అనే ఫైల్ లో పంపాను గమనించగలరు
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది .మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ...ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తమ మనుషులు ఉండాలని ఇరువురు నేతలు పట్టుపట్టడంతో అభివృద్ధికి ఆటంకంగా మారింది. మైలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న సోలార్ పరిశ్రమలో ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ .తాజాగా సుమారు మూడు కోట్లరూపాయల విలువైన సౌర పలకలను ధ్వంసం చేయడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ పని చేసింది ఎవరో ఇంతవరకు తెలియక పోవడం గమనార్హం
వాయిస్ ఓవర్1- కడప జిల్లా మైలవరం మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో సోలార్ పరిశ్రమ పనులు దాదాపు పూర్తికావచ్చాయి .ఈ పరిశ్రమలో 66 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందినవారు .మరో రెండు, మూడు నెలల్లో సోలార్ పరిశ్రమలో పనులు పూర్తి కానున్నాయి .ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గెలుపొందారు .సుధీర్ రెడ్డి అనుచరులు వెంటనే సోలార్ పరిశ్రమ లో తమ వర్గానికి చెందినవారు ఉంచుకోవాలని యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు25 మంది కార్మికులను విధుల నుంచి తొలగించారు .తొలగించిన కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇటీవల సోలార్ పరిశ్రమ వద్దకు వెళ్లి బాధితులతో కలిసి ఆందోళన చేశారు. అప్పటికే యాజమాన్యం రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన 20 మంది స్థానంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనుషులను నియమించుకున్నారు .ఆ వర్గ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది
వాయిస్ ఓవర్2
ఆదివారం రాత్రి సోలార్ పరిశ్రమలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు రెండు వేలకు పైగా సోలార్ పలకలు ధ్వంసం చేశారు. వీటి ఖరీదు ఒక్కోటి 15000 రూపాయలు ఉండొచ్చని అంచనా .ఈ లెక్క ప్రకారం సోలార్ యాజమాన్యానికి మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం ఉన్నట్లు తెలుస్తోంది .సోమవారం మధ్యాహ్నం వరకు ఆ సోలార్ పలకలను ఎవరు ధ్వంసం చేసింది ఒక నిర్ణయానికి రాలేదు .రాత్రి వరకు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు .చివరకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు మైలారం పోలీసులకు ఫిర్యాదు చేశారు .ఇంతటి భారీ విధ్వంసానికి ఎవరు పాల్పడి ఉంటారని పోలీసులు అర్థం కావడం లేదు .ఈ పని ఎవరూ చేశారో ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు.
ఎండ్ వాయిస్ ఓవర్
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇద్దరు బలమైన వర్గాలకు చెందిన నాయకులు వర్గ పోరు కారణంగా అభివృద్ధి కి ఆటంకం కలుగుతోంది. విధుల నుంచి తప్పించడం, మనుషులను నియమించు కోవడం వల్ల పరిశ్రమల యజమానులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Body:సోలార్ ధ్వంసం
Conclusion:సోలార్ ధ్వంసం