ETV Bharat / state

వంశధార నదిపై కూలిన పురాతన వంతెన - శ్రీకాకుళం జిల్లాలో వంతెన కూలిపోయింది

శ్రీకాకుళం జిల్లాలో 1974 లో నిర్మించిన పురాతన వంతెన కూలిపోయింది. బైదలాపురం గ్రామానికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

An ancient bridge overlooking the genealogical river
వంశధార నదిపై కూలిన పురాతన వంతెన
author img

By

Published : Mar 14, 2020, 8:41 PM IST

వంశధార నదిపై కూలిన పురాతన వంతెన

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బైదలాపురం గ్రామ సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై ఉన్న పురాతన వంతెన శుక్రవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఈ వంతెనను 1974లో నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. తరచూ గ్రానైట్‌ రాళ్లతో భారీ వాహనాలు రాకపోకలు చేయడమే కూలడానికి కారణమని ఆరోంచారు. వంతెన కూలిన కారణంగా.. బైదలాపురం గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నెల 21న ఎంపీటీసీ, 29న సర్పంచి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికారులకు, అటు ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న వంశధార అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి:

శ్రీకాకుళంలో ట్యాంకర్​లో పట్టుకున్న గంజాయి విలువ రూ.కోటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.