రాజకీయాలకు అతీతంగా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ చేసిన పోరాటాలకు న్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు శ్రీకాకుళంలో తెలిపారు. అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిపిన తెలంగాణ హైకోర్డు..20 వేల రూపాయలలోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతిచ్చిందని ఆయన అన్నారు. 13 లక్షల మంది 20 వేలలోపు డిపాజిట్ చేసిన వారు ఉంటారన్న నాగేశ్వరరావు..మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైతే..ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ముప్పాల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి