శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. పోస్టల్ కవర్ ఆవిష్కరణకు మంత్రి ధర్మాన కృష్ణదాసుతోపాటు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. అప్పటికే సోఫాలో కూర్చున్న రామ్మోహన్‌నాయుడు పక్కన అచ్చెన్న కూర్చోగానే..ఒక్కసారిగా సోఫా వెనక్కి ఒరిగింది. దీంతో అచ్చెన్నతోపాటు రామ్మోహన్‌నాయుడు సైతం కిందపడిపోయారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఇరువురిని పైకి లేపారు.
ఇదీ చదవండి :