జంబుకేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వేలంలో దేవాదాయ శాఖకు గతంలో కంటే 10 రెట్లు అధికంగా ఆదాయం లభించింది. గతేడాది వ్యాపార దుకాణాల నుంచి 9 లక్షల 11 వేలు ఆదాయం లభించగా... ఈ ఏడాది ఒక కోటి 8 లక్షల ఆదాయం వచ్చింది. పదమూడేళ్లుగా వ్యాపార దుకాణాలకు అద్దె మాత్రం చెల్లిస్తూ వ్యాపారులు దేవాదాయ శాఖ వద్ద రెన్యూవల్ చేయించుకునేవారు. ఈ ఏడాది ఇది బహిరంగ వేలం నిర్వహించడంతో 113 మంది వ్యాపారులు లక్ష రూపాయిల ధరావతు సొమ్ము చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొన్నారు. రాణి సత్రంలోని దేవాదాయశాఖ దుకాణాల రూమ్లో నుంచి భారీగా ఆదాయం రావడంతో ఈ మెత్తాన్ని రాయదుర్గం పట్టణంలోని ఆలయాల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా దేవాదాయ శాఖకు అద్దె రూపంలో ఆదాయం లభిస్తుందని రాయదుర్గం దేవాదాయశాఖ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చూడండి అక్రమ మార్గంలో అధికారంలోకి భాజపా'