శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల అచ్యుతాపురం గ్రామంలో 11 పురాతన నాణేలు లభ్యమయ్యాయి. మజ్జి భుజంగరావు అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి పునాది తవ్వుతుండగా ఈ నాణేలను గుర్తించారు.
వాటిని తహసీల్దార్ ఎం.కాళీ ప్రసాద్‌కు అప్పగించారు. నాణేలపై ఉర్దూ భాషలో అక్షరాలు ఉన్నాయని తహసీల్దార్ చెప్పారు. వాటిని పురావస్తు శాఖ అధికారులకు పంపిచినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: