స్వచ్ఛభారత్ పథకం కింద గ్రామానికి కేటాయించిన యంత్రాన్ని.. ఓ వైకాపా నాయకుడు తన సొంత పనులకు వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన వైకాపా నాయకుడు శ్రీనివాసులు.. తన ఇంటి ముందు ఉన్న మట్టిని చదును చేసేందుకు.. ఏకంగా స్వచ్ఛభారత్ యంత్రాలను వినియోగించుకున్నాడు.
గ్రామ పంచాయతీకి స్వచ్ఛభారత్ పథకం ద్వారా మినీ జేసీబీ, ట్రాక్టర్ ఇచ్చారు. వీటిని ఎవరి అనుమతీ లేకుండా వైకాపా నాయకుడు శ్రీనివాసులు ఉపయోగించుకోవడం.. స్థానికంగా చర్చకు దారి తీసింది. శ్రీనివాసులు వ్యవహారంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన యంత్రాలను.. ఓ ప్రైవేటు వ్యక్తి తన అవసరాలకు ఎలా వినియోగిస్తారని గ్రామస్థులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు.. యంత్రాల వాడకాన్ని నిలిపివేశారు.
ఇవీ చూడండి: