ETV Bharat / state

సిల్క్ వైభవం రివర్స్ గేర్ - పట్టుగూళ్ల మార్కెట్​లో రీలింగ్ యూనిట్లు మూసేస్తున్న యజమానులు - Silk Reeling Centers Owners Loss in Hindupuram

YSRCP Government Negligence on Silk Reeling Centers: జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక.. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు, ఉన్న ఉపాధి కూడా కోల్పోతున్న పరిస్థితి దాపురించింది. ఆసియాలో రెండో పెద్ద పట్టు గూళ్ల మార్కెట్​గా పేరొందిన హిందూపురంలో సిల్క్ రీలింగ్ కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్టు గూళ్లు సాగుచేసే రైతులకు, సిల్క్ దారం ఉత్పత్తి చేసే రీలింగ్ యూనిట్లకు అనేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించగా, జగన్ ప్రభుత్వంలో పరిస్థితి తిరగబడింది. పట్టు దారం రీలింగ్ యూనిట్లకు కిలోకు 130 రూపాయలు ఇచ్చే ఇన్సెంటివ్ 29 నెలలుగా 3.80 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు. ఈ రీలింగ్ యూనిట్ల ప్రాధాన్యతను గుర్తించిన గత ప్రభుత్వం ఆ కేంద్రాలకు ఇచ్చే విద్యుత్ ను మూడో కేటగిరిలో చేర్చగా, ఈ ప్రభుత్వం నాల్గో కేటగిరీకి మార్చటంతో విద్యుత్ బిల్లులు మూడు రెట్లు పెరిగిపోయాయి. కేంద్రాల యజమానులు అప్పుల ఊబిలో కూరకుపోయి అనేక యూనిట్లు మూతవేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మూతపడుతున్న సిల్క్ రీలింగ్ కేంద్రాలపై కథనం.

YSRCP_Government_Negligence_on_Silk_Reeling_Centers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 11:20 AM IST

YSRCP Government Negligence on Silk Reeling Centers : బెంగుళూరులోని రామనగర పట్టుగూళ్ల మార్కెట్​కు ఆసియాలో తొలిస్థానం కాగా, హిందూపురం మార్కెట్ రెండో స్థానంలో ఉంది. అయితే, ఇది గతంలో మాట. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి పట్టుగూళ్లు సాగు చేసే రైతు నుంచి దారం తీసే రీలింగ్ కేంద్రాల యజమానుల వరకు అందరూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఓవైపు కరోనా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టు మార్కెట్​ను కుదేలు చేయగా, మరో వైపు ఆదుకోని జగన్ ప్రభుత్వం తీరు రీలింగ్ కేంద్రాల యజమానులను అప్పులపాలు చేస్తోంది.

Silk Reeling Centers Closing In CM Jagan Ruling in Hindupuram : పట్టుగూళ్లు సాగుచేసే రైతులకు మార్కెట్ ధరకు అదనంగా ప్రతి కిలోపై రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలు ప్రోత్సాహక ధర ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మల్బరీ రైతులకు జగన్ ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు బకాయిపడింది. రైతుల నుంచి పట్టు గూళ్లు కొనుగోలు చేసి, ప్రాసెసింగ్​తో దారం ఉత్పత్తి చేసే రీలింగ్ కేంద్రాలకు, కిలో దారం ఉత్పత్తికి 130 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రీలర్లకు 29 నెలలుగా ఈ మొత్తం విడుదల చేయలేదు. ఒక్క హిందూపురం రీలర్లకే 3.80 కోట్ల రూపాయలు జగన్ సర్కారు బకాయిపడింది. జగన్ 2019 లో ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు హిందూపురంలో మల్బరీ రైతులకు, రీలింగ్ యూనిట్ల యజమానులకు అనేక హామీలు ఇచ్చారు. అయితే 29 నెలలుగా ఇన్సెంటివ్ విడుదల కాకపోవటంతో రీలింగ్ యూనిట్ల యజమానులు అప్పులపాలై కేంద్రాలు మూసేస్తున్నారు.

YSRCP Government Closing Skill Training Centers in AP: ఉద్యోగాల ఊసు లేదు.. స్కిల్ కేంద్రాల మూసివేత.. ఉపాధికి దూరంగా ఏపీ యువత
Silk Reeling Units Crisis in AP : పట్టు రీలింగ్ కేంద్రాల ప్రాధాన్యతను గుర్తించిన గత ప్రభుత్వం, వారి విద్యుత్ కనెక్షన్ ను మూడో కేటగిరిలో పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక, రీలింగ్ కేంద్రాలను నాల్గో కేటగిరీలోకి మార్చారు. దీంతో వారికి గతంలో వచ్చే విద్యుత్ బిల్లు మొత్తం మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ రెండేళ్లకు పైగా బకాయి పడటం, కేటగిరీ మార్పుతో విద్యుత్ ఛార్జీ అమాంతం పెరగటంతో రీలింగ్ కేంద్రాల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Silk Reeling Centers Owners Loss in Hindupuram : హిందూపురం పట్టణంలో 150 రీలింగ్ కేంద్రాలుండగా, ఇప్పటికే 46 కేంద్రాలు మూతపడ్డాయి. ఒక్కో కేంద్రంలో ఆరు మంది ఉపాధి పొందుతుండగా, సుమారు 300 మందికి ఉపాధి కోల్పోయారు. రీలింగ్ కేంద్రాలపై పరోక్షంగా ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో వంది మంది ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణం నుంచి వెళ్లిపోయారు. చాలా మంది రీలింగ్ కేంద్రాల యజమానులు అప్పులు తీర్చటానికి కర్ణాటకలోని పలు నగరాలకు వెళ్లి ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో పూర్తిగా నష్టపోయామని, రైతుల నుంచి వంద కేజీల గూళ్లు కొనడానికి కూడా పెట్టుబడి సొమ్ము లేక ఇబ్బంది పడుతున్నట్లు రీలర్లు, వారి సంఘం ప్రతినిధులు వాపోతున్నారు.

Sericulture: పట్టు రైతులకు రాయితీలు చెల్లించేది ఎప్పుడో..?

Hindupuram Silk Reeling Units in Crisis : పట్టు రీలర్లకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్, రైతులకు బకాయి పడిన ప్రోత్సాహక ధర సొమ్ము ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయా రంగాల్లోని వారు డిమాండ్ చేస్తున్నారు. రీలింగ్ కేంద్రాలు మూతపడితే రైతుల నుంచి పట్టుగూళ్లు కొనేవారు ఉండరని, ఈ విషయం ప్రభుత్వం గుర్తించాలని ఆ సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు.

పట్టుగూళ్లు కొనుగోళ్లు నిలిపివేత... రైతులు ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.