Irregularities in cement: సత్యసాయి జిల్లా మడశికరలో పలు అభివృద్ధి పనుల కోసం కేటాయించిన సిమెంట్ బస్తాల్లో.. అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ తెలిపారు. సిమెంట్ బస్తాల విషయంలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే తిప్పేస్వామి ఫిర్యాదు చేశారు. దీంతో.. విచారణ చేపట్టిన పంచాయతీరాజ్ అధికారులు.. బృందాలుగా ఏర్పడి డీఈఈ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి కేటాయించిన సిమెంటు బస్తాల్లో ప్రాథమికంగా 15 నుంచి 20 శాతం గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించామన్నారు.
Cement: సిమెంటు బస్తాల్లో అక్రమాలు.. ఎమ్మెల్యే ఫిర్యాదుతో గుర్తింపు - సత్యసాయి జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Irregularities in cement: ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు.. సిమెంటు బస్తాల్లో అక్రమాలను గుర్తించారు. 15 శాతం నుంచి 20వరకు గోల్‌మాల్ జరిగినట్టు తేల్చారు.