ETV Bharat / state

SEXUAL HARASSMENT : విద్యార్థునుల పాలిట కీచకుల్లా అధ్యాపకులు.. వెకిలి చేష్టలతో వేధింపులు

author img

By

Published : Apr 20, 2022, 5:32 AM IST

చదువుతో పాటు సంస్కారాన్ని బోధించాల్సిన అధ్యాపకులు... విద్యార్థునుల పాలిట కీచకుల్లా మారారు. వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధిస్తున్నారు. ప్రశ్నించిన మహిళా అధ్యాపకులనూ వేధిస్తున్నారు. సంరక్షించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అరాచకాలపై పోరాడుతున్న విద్యార్థులనూ ప్రలోభాలకు గురిచేసి... వర్గాలుగా విడగొట్టారు. స్థానిక రాజకీయ నేతలూ ఆ కీచకులతో చేతులు కలపడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏంచేయాలో అర్థంకాక... విద్యార్థినులు నరకయాతన పడుతున్నారు.

harashment
harashment

గోవా బీచ్‌లో భలే మజాగా ఉంటుంది.. చూపించాలా..! నా ఒడిలో కూర్చో బాగుంటుంది..! నాకెందుకు ఫోన్‌ చేయడం లేదు.. రోజూ నాతో ఫోన్‌లో మాట్లాడాలి. పొద్దున్నే హాయ్ చెప్పాలి. రాత్రి గుడ్‌నైట్‌ చెప్పాలి. నువ్వు ఎక్కడో ఎందుకు కూర్చుంటావ్‌.. రోజూ నాకు ఎదురుగా కనిపిస్తుండాలి..! విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు... విద్యార్థినుల పట్ల ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో చెప్పే కొన్ని మాటలివి. సత్యసాయి జిల్లా తలుపుల జూనియర్‌ కళాశాలలో... ఇద్దరు అధ్యాపకుల అరాచకాలు, వేధింపులతో విద్యార్థినులు అల్లాడిపోతున్నారు. చదువు మానలేక, వాళ్ల వేధింపులు భరించలేక సతమతమవుతున్నారు.

విద్యార్థునుల పాలిట కీచకుల్లా అధ్యాపకులు.. వెకిలి చేష్టలతో వేధింపులు

వారే లక్ష్యం: తల్లి లేక తండ్రి చనిపోయి సింగిల్‌ పేరెంట్ ఉన్న విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని... అసభ్యంగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు అధ్యాపకులు. అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు సేకరించి... దారుణంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అమ్మాయిల ముందే అబ్బాయిలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గోవా బీచ్‌ ఎంజాయ్‌మెంట్‌ చూపిస్తా అంటూ ఒకరు రెచ్చిపోతుంటే.... ఒళ్లో కూర్చోమంటూ మరొకరు హింసిస్తున్నారని బాధిత విద్యార్థినులు వాపోతున్నారు.

ఎవరికి చెప్పినా.. ప్రయోజనం శూన్యం: అధ్యాపకుల ఆగడాలను ఇంట్లోవాళ్ల దృష్టికి తీసుకెళ్లే ధైర్యం లేక ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే... చర్యలు తీసుకోకుండా ఆమెపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. మరో అధ్యాపకురాలికి బాధలు చెప్పుకుంటే... విద్యార్థినుల పక్షాన నిలబడ్డారని ఆమెనూ వేధించారు. ఇక లాభం లేదనుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాక... ఆ కీచకులు మరింత రెచ్చిపోయారు. ఒప్పంద లెక్చరర్లతో జట్టు కట్టి వేధింపులు తీవ్రం చేశారు. సమస్యను విద్యార్థి సంఘాల నాయకులకు చెబితే... తొలుత హడావుడి చేసిన వారంతా ఆ తర్వాత కీచకులతో కలసిపోయారని బాధితులు అంటున్నారు.

భయపడొద్దు- తిరగబడాలి: విద్యార్థినుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి... న్యాయం జరిగేలా చూస్తామని కళాశాల ప్రిన్సిపాల్ నీలోఫర్‌ చెబుతున్నారు. వేధింపుల వ్యవహారంపై విద్యార్థులతో మాట్లాడటానికి ఈటీవీ ప్రతినిధులు కళాశాలకు వెళ్లిన సమయంలోనే... రెడ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కీచకులకు భయపడొద్దని, వారిపై తిరగబడాలని ఆ సంస్థ డైరెక్టర్‌ భానూజ ధైర్యం చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని వేధింపులు ఆగేలా చూడకపోతే... చదువు మానేయడం తప్ప మరో గత్యంతరం లేదని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి: ఉపాధ్యాయుడి కీచక పర్వం..వెలుగులోకి ఆడియో.. పోక్సో కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.