Crop Damage Due To Power Cuts in AP : అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నారని శ్రీసత్యసాయి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కనగానపల్లి మండలంలో పలు గ్రామాల్లో మాజీ మంత్రి పరిటాల సునీత పర్యటించారు. కనగానపల్లి మండలంలో కనీసం ఏడు గంటలు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయక పోవటంతో వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లలో నీరున్నా విద్యుత్ కోతల (Current Cuts) కారణంగా పైరుకు నీరు అందించలేక పోతున్నామని కంటతడి పెట్టుకుంటున్నారు.
గత ఏడాది కురిసిన వర్షాలతో ఈసారి భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని ఆశపడ్డ రైతులు వరి సాగు చేశారు. బోర్లలో పుష్కలంగా నీరున్నా విద్యుత్ కోతలతో పంటలకు పెట్టుకోలేకపోతున్నారు. పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం ఏడు గంటల విద్యుత్ కూడా ఇవ్వలేకపోతున్నారు. చాలా గ్రామాల్లో రోజూ నాలుగు గంటల సరఫరా కూడా కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలన్నీ కళ్లెదుటే ఎండిపోతున్నాయని అన్నదాతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
TDP Leader Paritala sunitha Fire on Jagan For Power Cuts : విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలను పరిశీలించటానికి వెళ్లిన మాజీ మంత్రి పరిటాల సునీత, కనగానపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి.. రైతులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు. ఓవైపు కరవు, మరోవైపు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని, కనీసం విద్యుత్ సమస్యపై అధికారులతో మాట్లాడిన పాపాన పోలేదని సునీత విమర్శించారు.
Famers Protest For Current on Road : ఎండుతున్న పంటలు.. మండుతున్న రైతులు.. విద్యుత్ కోతలపై కన్నెర్ర
రైతు ప్రభుత్వమని చెప్పుకునే సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపు చేస్తూ, చంద్రబాబును అరెస్టు చేశామని ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ఆమె విమర్శించారు. ఓట్లేసి గెలిపించిన రైతులను ఎమ్మెల్యేలు ఇప్పటికైనా పట్టించుకోవాలని పరిటాల సునీత హితవు చెప్పారు.
Power Cuts in Prakasam District : ఆత్మహత్యలే శరణ్యం : అప్రకటిత విద్యుత్తు కోతలతో సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి విద్యుత్తు ఉపకేంద్రాన్ని రాత్రి సమయంలో ముట్టడించి.. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి త్రీఫేజ్ విద్యుత్తు సక్రమంగా ఉండడం లేదని, రోజుకు గంటకు మించి సరఫరా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు బావుల కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు చేతికి రాకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Power Cuts in YCP Government అప్రకటిత 'జగనన్న విద్యుత్ కోతల' పథకంతో.. అల్లాడిపోతున్న జనం!