ETV Bharat / state

బకాయిల కోసం కాంట్రాక్టర్ నిరాహార దీక్ష.. విషమించిన ఆరోగ్యం

Contractor Agitation for Pending Bills: ఆయనో కాంట్రాక్టర్​... రెండు రోజులు ఆలస్యమైనా బిల్లులు వస్తాయనే ధైర్యంతో ప్రభుత్వ పనులు చేశాడు.. కానీ మూడేళ్లు గడిచాయి.. అయినా బిల్లులు రాలేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. బకాయిల కోసం తాను పనులు చేసిన పాఠశాల ఎదుట నిరాహార దీక్ష చేపట్టాడు.. ఇప్పుడు ఆరోగ్యం విషమించి అతని ప్రాణాల మీదికే తెచ్చుకున్నాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా రొద్దంలో జరిగింది.

కాంట్రక్టర్
Contractor
author img

By

Published : Dec 23, 2022, 4:46 PM IST

Contractor Agitation for Pending Bills: శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 3 అదనపు తరగతి గదులు, 6 మరుగుదొడ్లు నిర్మించి 3 సంవత్సరాలు పూర్తయినా రూ.17 లక్షల బిల్లు బకాయి చెల్లించలేదని కాంట్రాక్టర్ గుత్తేదారు ధనుంజయరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం పాఠశాల ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు గురువారం రాత్రి 9.30గంటలకు పోలీసుల సహకారంతో రొద్దం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం ఉదయం అక్కడినుంచి పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బిల్లుల విషయంపై ఎంపీడీవో రాబట్టు విల్సన్ మాట్లాడుతూ పైస్థాయిలో బిల్లులు నిధులు విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.