CM Jagan Lies On Drought Conditions in Puttaparthi : రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో (Rainfall Conditions) లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు గగ్గోలు పెడుతుంటే సీఎం జగన్ మాత్రం వారు ఆనందడోలికల్లో ఊగిపోతున్నారంటూ పుండుమీద కారం చల్లుతున్నారు. రాష్ట్రంలో అసలు కరవే లేదని పగటి పూట రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అసత్యాలు వల్లెవేస్తున్నారు. ఏ రైతును కదిలించినా అప్పుల బాధతో గుండెలు బాదుకుంటుంటే అన్నదాతలు చిక్కిటి చిరునవ్వులతో ఆనందడోలికల్లో ఊగిసలాడిపోతున్నారంటూ సీఎం చెప్పడం విశేషం.
Jagan Mohan Reddy Lies On Rythu Bharosa Funds to Farmers : రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 7,500 రూపాయిలే అయినా కేంద్రం నిధుల్ని సైతం సీఎం జగన్ తన ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణలో రెండున్నర ఎకరాలున్న రైతులకు ఐదేళ్లకు లక్షా 25వేలు సాయం చేస్తుంటే రాష్ట్రంలో రైతులకు జగన్ ఇచ్చేది మాత్రం కేవలం 37వేల 500 మాత్రమే అయినా అబద్ధాలు ఎంత నేర్పుగా చెబుతున్నారు. తీవ్రమైన కరవు (Drought)తో రాష్ట్రం అల్లాడిపోతుంటే..అసలు కరవే లేదని నిస్సిగ్గుగా చెప్పడం జగన్‌కే చెల్లుబాటవుతుంది.
సీఎం పర్యటనలో కరవు మండలాల ప్రకటన వస్తుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే
YSRCP Government on Free Crop Insurance : రైతు బీమా పథకమే ఓ పెద్ద మాయ.. ప్రతి ఎకరాకూ ఉచిత పంటల బీమా (Free Crop Insurance) ఇస్తున్నామంటూనే పెద్ద ఎత్తున కోత విధిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం సాగు చేస్తున్నదెంత.. బీమా చేసిందెంత అనే విషయాలు మాత్రం సీఎం జగన్ చెప్పరు. ఎకరా టమోటాకు 172 రూపాయలు, పత్తికి 18వందల 15 రూపాయలు, కందికి 828 రూపాయలు ఇస్తే రైతులకు ఏం లాభం. దీన్నే పెద్ద సాయం చేసినట్లు సీఎం గొప్పగా చెప్పుకుంటున్నారు.
CM Jagan Commets on RBK : పండించిన ధాన్యం అమ్ముకోవడానికి రైతన్నపడిన కష్టం ప్రజలందరికీ తెలిసిందే. రోజుల తరబడి రోడ్లపై ధాన్యం పోసి, వర్షానికి తడిచిపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం. చేసేది లేక తక్కువ ధరకు రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ సీఎం జగన్ మాత్రం ఆర్బీకేల ద్వారా పంటలన్నీ కొనుగోలు చేస్తున్నామని పచ్చి అబద్ధాలు వల్లెవేశారు.
పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన - ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు
అమూల్ (Amul)ను తీసుకొచ్చి సహకార రంగాన్ని ఎంతో దెబ్బతీశారు. పాడిరైతులకు ఇస్తామన్న లీటర్‌కు 4 రూపాయల బోనస్‌కు మంగళం పాడిన జగన్.. వాటిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు.
రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నా.. కేవలం 5.38 లక్షల మందికే రైతు భరోసా ఇచ్చి జగన్ చేతులు దులుపుకున్నారు. వీరినే కులాల వారీగా విడగొట్టి.. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ గొంతు చించుకుని అరుస్తూ వారికి ప్రత్యేకంగా ఏదో మేలు చేస్తున్నట్లు భ్రమలు కల్పిస్తున్నారు.