ETV Bharat / state

Subbarao Gupta Attack Issue: సుబ్బారావు గుప్తాను పరామర్శించిన పలువురు నేతలు - వైకాపా నేత సుబ్బారావు గుప్తాపె డాది

Subbarao Gupta News: వైకాపా నేత సుబ్బారావు గుప్తాను అదే పార్టీకి చెందిన పలువురు నేతలు పరామర్శించారు. దాడి ఘటన బాధాకరమన్న నేతలు.. ధైర్యంగా ఉండాలని గుప్తాకు సూచించారు.

సుబ్బారావు గుప్తాను పరామర్శించిన వైకాపా నేతలు

author img

By

Published : Dec 21, 2021, 4:05 PM IST

Updated : Dec 21, 2021, 4:47 PM IST

సుబ్బారావు గుప్తాను పరామర్శించిన పలువురు నేతలు

Attack on YSRCP leader subbarao Gupta: మంత్రి బాలినేని అనుచరుల చేతిలో దాడికి గురైన వైకాపా నేత సుబ్బారావు గుప్తాను అదే పార్టీకి చెందిన పలువురు నేతలు పరామర్శించారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుప్పం ప్రసాద్​, ఆర్య వైశ్య రాష్ట్ర మహా సభ అధ్యక్షుడు ద్వారకనాథ్​తో పాటు మరికొందరు వైకాపా నేతలు గుప్తా ఇంటికి వచ్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. జరిగిన ఘటన బాధకరమని.., సుబ్బారావు కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని కోరారు. పార్టీ పరంగా, ఆర్యవైశ్య సంఘాల పరంగా ఆయనకు అండగా నిలుస్తామన్నారు.

ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించాలి: సుబ్బారావు

మంత్రి బాలినేనిని గత రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి కలిశామని సుబ్బారావు ఉన్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారన్నారు. తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని సుబ్బారావు కోరారు.

ఏం జరిగిందంటే...

ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలు చేసారు. వారి వ్యవహార శైలితో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని అన్నారు. దీంతో ఆయనకు సొంత పార్టీలోని పలువురి నుంచి బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే సోమవారం సుబ్బారావు గుప్తాకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకుంటున్న గుప్తాపై మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను..’ అంటూ గుప్తాను విచక్షణారహితంగా కొట్టడం తీవ్ర సంచలనం కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.

బాలినేని ఏమన్నారంటే..

పార్టీపై సుబ్బారావు గుప్తా చేసిన విమర్శల విషయమై దాడి చేసి ఉంటారని.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుప్తాకు మతిస్థిమితం లేదని..ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక తెదేపా నేత దామచర్ల జనార్దన్ ఉండొచ్చని ఆరోపించారు.

దాడిని ఖండించిన తెదేపా, ప్రజాసంఘాలు

సుబ్బారావు గుప్తాపై దాడిని ఆర్యవైశ్య సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఖండించారు. వైకాపా నేతలు దాడి దారుణమని..తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీలకు అతీతంగా వైశ్యులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. పాలన విధానం మార్చుకోవాలని సూచించిన సుబ్బారావు గుప్తాపై వైకాపా రౌడీ మూకలు దాడి చేయడం ఏంటని తెదేపా వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతిపత్రం అందించారు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిద్దలూరులోనూ తెదేపా నాయకులు ఆందోళన చేశారు.

ఘటనపై కేసు నమోదు..

గుంటూరు లాడ్జిలో గుప్తాపై జరిగిన భౌతిక దాడులపై.. ఒంగోలు వన్ టౌన్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడిపై సుబ్బారావు గుప్తా పిర్యాదు చేయకపోయినా.. అతనిపై దాడి చేసిన దృశ్యాలు బయటకు రావడంతో సుమోటోగా కేసు నమోదు చేశారు. సుబ్బారావు భార్య సుభాషిణిని సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి పంపించారు.

ఇదీ చదవండి

Subbarao Gupta Attack: మంత్రి బాలినేనిని కలిసిన గుప్తా.. వివాదం సద్దుమణిగిందా..!

Last Updated : Dec 21, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.