ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించారు. చీరాలలోని వైకాపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ జెండాను ఎగరవేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించారు. స్థానిక మసీదు కూడలిలో కరణం వెంకటేష్ ఆధ్వర్యంలోని వైకాపా శ్రేణులు అవిర్భావ వేడుకలు జరిపారు. కేక్ కోసి, సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నాయకులు అన్నారు.
ఇదీ చదవండి: యర్రగొండపాలెంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం