భగవంతుడు ప్రసాదించిన కంటి చూపులో అంధత్వం ఉండకూడదనే ఉద్దేశ్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కంటి వెలుగు పధకం ప్రవేశ పెట్టారని విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కంటివెలుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఏఎన్ఎమ్ లకు కిట్లు పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని, విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, కంటి అద్దాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాలినేని తెలిపారు. ఈ ఎంపీ మాగుంటు శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
ఇదీ చదవండి:వైఎస్సార్ కంటివెలుగు పథకానికి నేడే శ్రీకారం