ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం ఆలమూరు అనమనమూరు గ్రామ శివారులోని శివాలయం వద్ద గుర్తుతెలియని కొందరు గుప్తనిధుల కోసం పూజలు చేస్తున్నారంటూ గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొద్దిరోజులుగా గ్రామంలో ఉంటూ ఈతతంగం చేస్తున్నారని గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆ కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ గుడి పురాతన కాలంలో కట్టింది అయి ఉండటం.. గ్రామానికి సుదూర ప్రాంతంలో ఉండడంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి :