ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యం మానవత్వానికి మచ్చలా నిలిచింది. కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయింది. మృతులందరిది కర్ణాటక కావడం వల్ల బంధువులు వచ్చేందుకు సమయం పట్టింది. మృతులను ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ మార్చురీకి తరలించాల్సి ఉండగా... మృతదేహాన్ని తరలించేందుకు వైద్యశాల సిబ్బంది ముందుకు రాలేదు. చాలాసేపు తరువాత పంచాయతీ కార్మికులు వచ్చి మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. కొంత దూరం తీసుకెళ్లిన వారు బరువు అధికంగా ఉందని ఆసుపత్రి ఆవరణలోనే మృతదేహాన్ని వదిలేశారు. అక్కడున్న వారంతా చూస్తూ ఉన్నారే తప్ప సాయం చేసేందుకు ముందుకు రాలేదు.
ఇవీ చూడండి: