ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న కారు... రాజుపాలెం బస్‌స్టాప్ వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు కింద పడ్డారు. ప్రమాదంలో రాజుపాలెంకు చెందిన గంటి విజయ అక్కడికక్కడే మృతి చెందగా...గోపి, కల్యాణిలకు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరు మార్టూరులో జరిగే శుభకార్యానికి వెళుతున్నట్లు సమాచారం. మార్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రైతు కంట్లో.. లాక్ డౌన్ కారం