ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలో రాజన్న బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నారా విజయలక్ష్మి, ఎంఈవో ఆంజనేయులు కోఆప్షన్ సభ్యులు మాజిద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇదీచదవండి