ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడులో తాగునీటి సమస్యతో ప్రజలు పోరుబాట పట్టారు. ట్యాంకర్లతో నీటిని తోలుతున్న కాంట్రాక్టర్... బోర్లకు వినియోగించే కరెంటును అక్రమంగా తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ప్రభావం.. గ్రామస్తులపై పడింది. విద్యుత్ సదుపాయం లేక.. ట్యాంకర్లతో నీటి సరఫరాకు అడ్డంకిగా మారింది. సమస్య తీవ్రమైన పరిస్థితుల్లో... బాధితులు మంచినీటి కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి