
ప్రకాశంలోని కారంచేడు మండలం కుంకలమర్రులో వైకాపా జిల్లా కార్యదర్శి జువ్వా శ్రీనివాసరావుకి శ్రద్ధాంజలి తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దుండగలు చించివేశారు. దాంతో ఆయన అభిమానులు, అనుచరులు కారంచేడు పోలీస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ అనుచరులే ఈ చర్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీలు చించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను గుర్తించి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్సై ఆహమ్మద్ జానీ హమీ ఇచ్చారు.
ఇదీ చదవండి: