ప్రకాశం జిల్లా దర్శి మండలం జముకులదిన్నె గ్రామస్థులు వేలంపాట ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఆ వేలంపాట ద్వారా వచ్చే మొత్తాన్ని దేవాలయ నిర్మాణానికి వాడాలని ప్రణాళికలు రూపొందించారు. మిగులు పైకాన్ని ఊరి సమస్యల పరిష్కారానికి వినియోగించాలన్న షరతులపై వెేలంపాట నిర్వహించారు. వేలంపాటలో గ్రామానికి చెందిన మర్రి సత్యన్నారాయణ 26లక్షల 90వేల రూపాయలకు చేజిక్కించుకున్నాడు. పార్టీలకు అతీతంగా ఈ వేలంపాట నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రకాశంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రం హీరో ప్రదీప్