ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ బీటీ. నాయక్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని పలు దుకాణాలపై ఆయన ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. అధిక ధరలకు సరుకులు అమ్ముతున్న 3 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నల్లబజార్లో విక్రయాలను నియంత్రించేందుకు ప్రతి దుకాణంలో ధరల పట్టిక పెట్టాలని సూచించారు. దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: