ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల, పేరాల, వేటపాలెం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లోని వైష్ణవాలయలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ నాథుడిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. పేరాలలోని మదనగోపాలస్వామి దేవాలయంలో రావులకొల్లు రంగాచార్యులు ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వీరరాఘవ స్వామి దేవాలయంలో..
చీరాలలోని వీరరాఘవ స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠం ద్వారం ప్రవేశం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయాని భక్తుల విశ్వాసం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకున్నారు.
సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో..
అద్దంకి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము నందు ముక్కోటి ఏకాదశి పూజలు కన్నుల పండువగా జరిపారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం గోపూజ, బిందెతీర్ధం, నిత్య అభిషేక కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ముందుగానే చర్యలు చేపట్టారు.
కనిగిరిలో...
కనిగిరిలో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకొనేందుకు వేకువజాము నుంచే భక్తులు దేవాలయాలకు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకొని భక్తులు స్వామివారికి అభిషేక గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చూడండి...