ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం కాలవలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఈపురుపాలెం పోలీసులు వెలికితీశారు. మండలంలోని విజయలక్ష్మీపురం కాలవ తలుపుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని ఈపురుపాలెం పోలీసులకు తెలియజేశారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని వయసు సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి