ఉన్నతాధికార్ల నిర్వాకంతో కిందిస్థాయి ఉద్యోగులు అయోమయంలో పడిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటు చేసుకుంది. మండలంలో వ్యవసాయ అధికారిగా జులై నుంచి విధులు నిర్వహిస్తున్న మధుబాబు సెలవులో ఉండగా, ఆ స్థానంలోకి మార్కాపురంలో పనిచేస్తున్న బాలకృష్ణనాయక్ ను బదిలీ చేస్తూ, వ్యవసాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మధుబాబు ను కృష్ణనాయక్ పనిచేస్తున్న మార్కపురంకు బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులతో ఖంగుతిన్న మధుబాబు కోర్టును ఆశ్రయించాడు. సెలవులో ఉండగా, తన స్థానంలో మరొకరిని ఎలా నియమిస్తారని, తనను ఎలా బదిలీ చేస్తారని వాపోయాడు. మధుబాబు వాదన విన్న కోర్టు బదిలీ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో సెలవు అనంతరం ఎప్పటిలాకే, వ్యవసాయ కార్యాలయంలో తన విధులకు మధుబాబు హజరు కావడం, బదిలీపై వచ్చిన కృష్ణనాయక్ అప్పటికే విధుల్లో చేరడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కింది స్థాయి ఉద్యోగులు ఎవరి ఆదేశాలను పాటించాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి.
ఇదీచూడండి.వందరోజుల పాలనకు వంద మార్కులు:జేసీ