తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లికి చెందిన చల్లా మల్లికార్జున్రెడ్డి, ఎర్రవారిపల్లికి చెందిన ఆదిలక్ష్మీ.. ఒడిశాలో బొంగు పేలాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
రెండు వేరువేరు కుటుంబాలకు చెందిన వీరు.. సొంత ఊరు నుంచి ఒడిశాకు కారులో బయలుదేరారు. తుమ్మలపల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనలో నాలుగేళ్ల చిన్నారి నవ్యకి తీవ్రగాయాలవ్వగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.