ETV Bharat / state

విషాదం: రోడ్డు ప్రమాదంలో కుమారుడు..గుండెపోటుతో తండ్రి !

రోడ్డు ప్రమాదం ఆ కుటంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గంటల వ్యవధిలోనే తండ్రీ కుమారులను పొట్టనబెట్టుకుంది. భర్త మరణ వార్త విన్న ఆ ఇల్లాలు ఇక బతికుండలేనని ఆత్మహత్యాయత్నానికి యత్నించి ఆసుపత్రి పాలైంది. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.

two died at prakasham accident
రోడ్డు ప్రమాదంలో కుమారుడు..గుండెపోటుతో తండ్రి
author img

By

Published : May 10, 2021, 12:54 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం నీలకంఠయ్య వీధికి చెందిన సూరే కోటేశ్వరరావు ఆసుపత్రికి వెళ్లేందుకు కూమారుడితో కలిసి కారును అద్దెకు తీసుకొని గుంటూరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కోటేశ్వరావు కుమారుడు కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన కోటేశ్వరరావుతో పాటు కారు డ్రైవర్​లను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందగా..కోటేశ్వరరావుకు వైద్యం చేసి ఇంటికి పంపించారు.

కుమారుడి మరణ వార్త విని

ఇంటికి చేరుకున్న కోటేశ్వరావు కుమారుడు మరణవార్తి విని తల్లడిల్లిపోయాడు. గుండెలవిసేలా రోధించి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. మృతుడు కృష్ణ భార్య కూడా భర్త మరణ వార్తవిని తట్టుకోలేక పోయింది. ఇంట్లోకి వెళ్లి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను హుటాహుటిన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తీరని విషాదం

ఒకే ఇంట్లో గంటల వ్యవధిలో తండ్రీ కుమారులు మృతిచెందటం, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్సపొందుతుండటం స్థానికులచే కంటతడి పెట్టించింది. విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది.

ఇదీచదవండి

కరోనా నింపిన విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.