ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చక్రయాపాలెం వద్ద కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కందుకూరు మండలం పెద్దమోపాడు గ్రామానికి కర్మకాండకు వస్తుండగా ఈ విషాదం జరిగింది.
ఇద్దరు మృతి చెందగా.. వారిని తన్నీరు అంకమ్మ రావు, కుంచాల ఓబులెయ్యగా నిర్థరించారు. ఘటనలో తీవ్రంగా గాయపపడిన వారిని 108 వాహనంలో నరసరావుపేటకు తరలించారు. ఎస్సై మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: