కరోనా కష్టకాలంలో తల్లిగా రోగులను కంటికి రెప్పలా చూస్తున్న నర్సులను గౌరవించడం మన బాధ్యత అని ప్రకాశం జిల్లా చీరాల కామాక్షి కేర్ ఆసుపత్రికి ఎండీ తాడివలస దేవరాజు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటలో నర్సులను శాలువాతో ఘనంగా సన్మానించారు.
బంధువులు, కుటుంబ సభ్యులు కూడా కరోనా బాధితుల దగ్గరికి రాలేని పరిస్థితుల్లో.. నర్సులు ప్రాణాలకు తెగించి రోగుల ప్రాణాలు కాపాడడానికి సేవ చేస్తున్నారన్నారు. అలాంటి వారిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సన్మానించడం మన కర్తవ్యమన్నారు. డాక్టర్ చింతల జై హరీష్, డాక్టర్ మేడిశెట్టి సాయి కుమార్, డాక్టర్ తాడివలస కుమార్, తాడివలస సురేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: