ETV Bharat / state

అందరూ పేదలేకానీ... లబ్ధి'దారులే'వేరయా..! - Tidco Houses Distribution news

సొంతిళ్లు లేని పట్టణ పేదలువారు. వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గత ప్రభుత్వం సంకల్పించింది. టిడ్కో (పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ) ద్వారా ఇళ్లు నిర్మించడానికి నడుంకట్టింది. జిల్లాలో 11,968 ఇళ్లను మంజూరు చేసింది. నిర్మాణం పూర్తిదశలో ఉంగా ప్రభుత్వం మారడం, తర్వాత వచ్చిన ప్రభుత్వం అర్ధాంతరంగా ఇళ్ల పనులు నిలిపేయడం కారణంగా ఆ ఇళ్లనే నమ్ముకున్న పేదవారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పులు చేసి కిరాయి ఇళ్లలో రెండేళ్లుగా యాతన అనుభవించారు.

Tidco Houses Construction in Prakasham District
అందరూ పేదలేకానీ... లబ్ధి'దారులే'వేరయా..!
author img

By

Published : Dec 11, 2020, 7:01 PM IST

జిల్లాలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను పరిగణలోకి తీసుకొని 25శాతం కంటే తక్కువ పనులు జరిగిన ఇళ్లను రద్దుచేయగా... ఎంతోమంది పేదలు టిడ్కో ఇళ్లపై ఆశలు వదులుకున్నారు. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా పనులు కొనసాగడం, ప్రభుత్వం నుంచి పలు రాయితీలు లభించడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఆ ఇళ్లపై ఆశలుపెట్టుకున్నది అందరూ పేదవారేకాగా.. వారికి కలిగే లబ్ధిమాత్రం రకరకాలుగా ఉంది.

2400 ఇళ్లు తగ్గాయి...

జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, కందుకూరు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలో మొత్తం 11,968 టిడ్కో ఇళ్లు మంజూరు అయ్యాయి. 25శాతం లోపు పనులు జరిగిన 2400 ఇళ్ల నిర్మాణం రద్దు అయ్యాయి. అవిపోగా ప్రస్తుతం 9568 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో కందుకూరులో 80శాతంకుపైగా పనులు పూర్తయ్యాయి. ఒంగోలులోని కొప్పోలు రోడ్డులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా చేపట్టిన 1536 ఇళ్లు నిర్మాణం ఆలస్యమయింది. ప్రస్తుతం శ్లాబ్‌దశకు వచ్చింది. మిగిలిన అన్ని పట్టణాల్లో 60 నుంచి 70శాతం మధ్య పనులు పూర్తయినట్లు టిడ్కో అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఎనిమిది నెలల్లోనే నిర్మాణ పనులు పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో టిడ్కో లబ్ధిదారులందరికీ మంజూరు పత్రాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు.

రూపాయి ఇళ్లు ఇలా...

నెలలు గడుస్తున్నా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయకపోవడంపై రాష్ట్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఒకదశలో జనవరిలో ఆ ఇళ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాయి. ప్రభుత్వం ఈ ఇళ్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మూడు రకాల లబ్ధిదారులక ఊరట లభించింది. వాటా కట్టి ఇళ్లు రద్దు అయినవారికి మాత్రం ఇంటి స్థలాలు కేటాయించి ఇంటిని నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమేరకు వారు కట్టిన వాటా డబ్బులు తిరిగి చెల్లిస్తారు. మంజూరై నిర్మాణం మొదలై పునాదుల్లో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం నిలిచిపోగా దానికి వెచ్చిందిన నిధులు వృథా అయ్యాయి.

లబ్ధి ఎలా అంటే..?

సింగిల్‌ బెడ్‌రూం 300 చదరపు అడుగుల ఇంటివిలువ రూ.6.65 లక్షలు కాగా ఇందులో కేంద్రం సబ్సిడీ 1.50, రాష్ట్ర సబ్సిడీ 5.15. లబ్ధిదారుని వాటా కింద రూ.1 చెల్లించాలి. 365 చదరపు అడుగుల ఇంటి విలువ రూ.7.65 లక్షలు కాగా కేంద్రం సబ్సిడీ రూ.1.50, రాష్ట్ర సబ్సిడీ 2.85 లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.25వేలు. మిగిలిన సొమ్ము బ్యాంకు రుణంగా ఇప్పిస్తారు. 430 చదరపు అడుగుల డబుల్‌బెడ్‌రూం విలువ రూ.8.65 కాగా కేంద్రం సబ్సిడీ రూ.1.50, రాష్ట్ర సబ్సిడీ 2.85. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు. మిగిలిన సొమ్ము బ్యాంకు రుణంగా ఇప్పిస్తారు. చీరాలకు టిడ్కో ఇళ్లు మంజూరు జరగలేదు. చీమకుర్తిలో స్థలసేకరణ జరగనందున రద్దుచేశారు.

లబ్ధిదారులకు మంజూరు పత్రాలు..

టిడ్కో లబ్ధిదారులందరికీ మంజూరు పత్రాలు ఇస్తున్నాం. ఒంగోలులో మొత్తం 4,128 మందికి ఇంకా 350 పత్రాలు రావాల్సి ఉంది. త్వరలో వారికి అందజేస్తాం. బ్యాంకు లింకేజి అవసరమైన లబ్ధిదారులకు మెప్మా సిబ్బంది సహకారం అందిస్తారు. బ్యాంకులతో మాట్లాడి డాక్యుమెంటేషన్‌ పూర్తిచేయిస్తారు. -కె.భాగ్యలక్ష్మి, కమిషనర్, నగరపాలక సంస్థ

మౌలికవసతులు కల్పిస్తాం..

రివర్స్‌ టెండరింగ్‌ జరిగిన పట్టణాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల నిర్మాణం పూర్తయి, లోపల పనులు మొదలు పెట్టాం. మురుగునీటి వ్యవస్థ, అంతర్గత సిమెంట్‌ రోడ్లు, విద్యుత్తు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తాం. బడి, పార్కులు, సామాజిక భవనం, వైద్యశాల లాంటి అవసరాల పనులు ఇతర శాఖల ద్వారా చేపడతారు. -వెంకటేశ్వరరావు, టిడ్కో పర్యవేక్షక ఇంజినీర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.