గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో నీటి మునిగిన పంటలను వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ విదేశాల నుంచి రాగానే పంటనష్ట పరిహారంపై ఓ నిర్ణయం తీసుకుంటామని... ఆలోపు పంట నష్టాలు వివరాలు పూర్తి చేస్తామని నాగిరెడ్డి తెలిపారు. అనంతరం పసుపు, అరటి, నిమ్మ, జామ, మినుము, ఇతర కూరగాయల పంటల నష్టంపై రైతులతో చర్చించారు. కరకట్ట దిగువున ఉన్న దాదాపు రెండు వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని ... గత ప్రభుత్వం కంటే ఎక్కవ నష్టపరిహారం వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీచూడండి.బిఎస్ఎన్ఎల్ వినియోగదారుడికి వింత అనుభవం