వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఎఎన్ఎం లు ఆందోళనకు దిగారు. తమను క్రమబద్దీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్ ప్రకాశం జిల్లా చీరాలలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు ఆశావర్కర్స్ నాయకులు మద్దతు పలికారు. గత 18సంవత్సరాల నుంచి ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోలేదని ఉద్యోగులు వాపోయారు. సీఎం అయితే ఎఎన్ఎం ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తానని జగన్ పాదయాత్రలో చేసిన వాగ్దానం ను వారు గుర్తు చేశారు. తమ హామీని సిఎం ఇంతవరకు పట్టించుకోలేదని ఎఎన్ఎమ్ లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:గోదారి వరద తగ్గినా.. ముంపు ముప్పు తీరలేదు!