దసరా శరన్నవరాత్రి వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా జగజ్జననికి తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చీరాలలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా.. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కొలనులో తెప్పోత్సవం కన్నులపండువగా జరిపించారు. వేటపాలెంలోని శ్రీ కన్యకపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా తెప్పోత్సవం నిర్వహించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి: TTD: శాస్త్రప్రకారమే తిరుమలలో పూజలు, ఉత్సవాలు