వరుసగా రెండో సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని జిల్లా విద్యాధికారి సుబ్బారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రెండో స్థానంలో నిలవటంతో డీఈవో కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అధికారులు డీఈవోను సన్మానించారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక విధానాలు అవలంబించటం వల్లే ఈఘనత సాధించామని తెలిపారు. కేవలం 0.02 శాతం తోనే మొదటి స్థానాన్ని కోల్పోయామని వివరించారు. తిరిగి మొదటి స్థానంలో నిలిచేలా ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు.
ఇది కూడా చదవండి.