ETV Bharat / state

CHANDRABABU: అబద్దాలతో అధికారం.. వైఎస్సార్సీపీ పాలన క్రైం, కరప్షన్​ : చంద్రబాబు - ఏపీ ముఖ్యవార్తలు

Chandrababu's visit to Prakasam district : అబద్దాలు చెప్పి.. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ పాలన అంతా కూడా అవినీతిమయం అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయాడని, జాబ్ క్యాలెండర్ ఊసే లేదని మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నించే వారిపై పోలీసు జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.

చంద్రబాబు నాయుడు రోడ్ షో
చంద్రబాబు నాయుడు రోడ్ షో
author img

By

Published : Apr 19, 2023, 10:31 PM IST

Chandrababu's visit to Prakasam district : ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా గిద్దలూరులో రోడ్‌ షో నిర్వహించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ రోడ్ షోలో కార్యకర్తలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రోడ్ షోలో సౌండ్ సిస్టం వాహనాన్ని అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చేయగా చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

ధరల మంట.. వేతనాల తంటా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలకు తోడు ఇసుక, కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ కొనసాగుతోందని, ఐదుగురు సభ్యులు ఉన్న ప్రతీ కుటుంబంపై రూ.10 లక్షల భారం ఈ ప్రభుత్వం మోపిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉద్యోగులు, పోలీసులకు సమయానికి జీతాలు రావడం లేదని, ఒకటో తేదీన జీతం ఇస్తే చాలనే స్థితికి ఉద్యోగులు వచ్చారని తెలిపారు.

ఏరులై పారుతున్న మద్యం... ఎక్కడాలేని మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్న చంద్రబాబు.. మద్యం దుకాణాల నుంచి కొంత తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందని ఆరోపించారు. అబద్ధాలు చెప్పి, నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం.. అవినీతిని ప్రశ్నిస్తే చాలు.. కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డిది గుండెపోటు అని ప్రజలకు చెప్పింది ఎవరు అని ప్రశ్నిచిన బాబు.. గొడ్డలితో కిరాతకంగా చంపారని శవపరీక్షలో తేలిందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ పరిపాలన అంతా క్రైమ్‌, కరప్షన్‌ మయమైందని తెలిపారు.

పడకేసిన అభివృద్ధి.. ప్రాజెక్టులు ప్రారంభించింది.. పూర్తి చేసింది మేమే.. ఈ ప్రభుత్వం వెలిగొండ పూర్తి చేసుంటే గిద్దలూరు ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదని చంద్రబాబు అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక వెలిగొండకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని తెలిపారు. తమ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి.. అధికారంలోకి రాక ముందు జాబ్ క్యాలెండర్ అని ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలైతే.. వీరు ఇచ్చింది వాలంటీర్‌ ఉద్యోగాలు అని ఎద్దేవా చేశారు. విశాఖకు మకాం మారుస్తానన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వస్తారని తెలిసి విశాఖ ప్రజలు భయపడుతున్నారని, మీరు వెళ్లాల్సింది విశాఖకు కాదు.. ఇడుపులపాయకు.. అని పేర్కొన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌కు ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన చేశారు.. పులివెందులలో బస్టాండ్‌ కట్టలేనివారు ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే.. వాటికి మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచిన జగన్.. గంజాయి నియంత్రణ గురించి ఒక్కసారైనా సమీక్ష జరిపారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.