ETV Bharat / state

చెన్నైలో దొరికింది బాలినేని హవాలా డబ్బు: తెలుగుదేశం

తమిళనాడులో దొరిగిన డబ్బు ముమ్మాటికీ హవాలా డబ్బేనని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. జగన్ బంధువులకు తరలిస్తున్న క్రమంలోనే పోలీసులకు చిక్కిందని... విషయాన్ని దారి మళ్లించడానికే తెలుగుదేశం సానుభూతిపరులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించింది. ఇదే అంశంపై గవర్నర్​కు, ఆ జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖలు రాశారు. ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం నేతలు కూడా సర్కారు వైఖరిని ప్రశ్నించారు.

tdp leaders comments on balineni money
tdp leaders comments on balineni money
author img

By

Published : Jul 18, 2020, 8:06 PM IST

వేధింపులు పెచ్చుమీరాయి.... గవర్నర్​ జోక్యం అవసరం: చంద్రబాబు

తమిళనాడులో చిక్కిన సొమ్ముపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్​ చేసింది. అసలు విషయాన్ని విడిచి పెట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వాళ్లను వేధించడమేంటని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికార పార్టీ వేధింపులు పెచ్చు మీరుతున్నాయని గవర్నర్​కు లేఖ రాశారు. వేధింపులు, చట్ట విరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధమైన అరెస్టులు, అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ హరించివేస్తోందని విమర్శించారు.

5.27 కోట్ల రూపాయలు పట్టుబడి 72 గంటలకు పైగా గడిచిపోయింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా నాయకులపై తప్పుడు కేసులను మాత్రమే వేసే బాధ్యతను వారు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ సభ్యులతో సంబంధం ఉండి అవినీతి, మనీలాండరింగ్ కు పాల్పడేవారిపై ఏసీబీ ఉదాసీనంగా వ్యవహరిస్తుందా? అని నిలదీశారు.

బాలినేనిపై తమిళనాడు మీడియా కోడై కూసింది

బాలినేనిపై తమిళనాడు అంతటా మీడియాలో ప్రసారమయ్యాయని... నగదు రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టి సందీప్, చంద్రశేఖర్‌ను వేధించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మూడు స్టేషన్లు తిప్పుతూ దారుణంగా కొట్టి భౌతికంగా హింసించారని ఫిర్యాదు చేశారు. సత్వర న్యాయం అందించేలా గురుతర జోక్యం తక్షణ అవసరమని గవర్నర్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్‌ జోక్యం సమాజంలోని వ్యవస్థల విలువలపై విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?

ప్రకాశం జిల్లా ఎస్పీకి కూడా చంద్రబాబు లేఖ రాశారు. పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో వారిని హింసించటం తగదంటూ హితవు పలికారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఇలా చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టు చేసిన సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రికి సంబంధించిన నగదు వ్యవహారంపై తమిళనాడు మీడియాలో ప్రసారమైందని.. ఆ విషయంలో ఏపీలో ఎందుకు తనిఖీలు చేయలేదనే సందీప్​, చంద్రశేఖర్​ ప్రశ్నించారని తెలిపారు.

సమగ్రదర్యాప్తు జరగాలి

చెన్నైలో దొరికిన నగదుపై దర్యాప్తు చేపట్టాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. వెలుగులోకి తెచ్చిన సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులా? అంటు నివ్వెర పోయారు. పట్టుబడిన నగదుపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చెన్నైలో ఉన్న జగన్ కుటుంబానికే ఈ నిధులు తరలించారని ఆరోపించారు.

ముందే ఎందుకు కంగారు?

దొంగే దొంగ అన్న రీతిలో మంత్రి బాలినేని వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిని అరెస్టు చేయించడం దుర్మార్గమన్నారు. తనది కాని స్టిక్కర్‌పై మంత్రి బాలినేని కంగారుగా ముందే ఎందుకు స్పందించారని నిలదీశారు.

బాలనినేని బలవంతంగా చెప్పించారు: చినరాజప్ప

జగన్ బంధువు బాలినేని తరచూ హవాలా ద్వారా తమిళనాడుకు డబ్బు పంపిస్తారని ఆరోపించారు మాజీ మంత్రి చినరాజప్ప. పట్టుబడిన వాళ్లు బాలినేని డబ్బు అని చెప్పడం వల్లే అక్కడి మీడియాలో వచ్చిందన్నారు. తనకు సంబంధం లేదని తర్వాత అందరితో బాలినేని బలవంతంగా చెప్పించారని విమర్శించారు.

వారందర్నీ అరెస్టు చేస్తారా?

తెలుగుదేశం కార్యకర్తల అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే డీ.శ్రీబాల వీరాంజనేయస్వామి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షసాధింపు, బెదిరింపు చర్యలతో భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు. పత్రికల్లోనూ, తమిళనాడుకు చెందిన టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలు మాత్రమే వారు ఫార్వార్డ్ చేశారన్నారు. వేల మంది ఇది ఫార్వార్డ్ చేస్తుంటారనీ.. వారందర్నీ అరెస్టు చేస్తారా అని నిలదీశారు. తెలుగుదేశం కార్యకర్తలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా కేసులు పెట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు.

పోలీసుల అదుపులో తెదేపా సానుభూతిపరులు

తమిళనాడులో భారీగా పట్టుబడిన నగదుపై.. మంత్రి బాలినేనికి సంబంధం ఉందనే పోస్టును సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేసిన ఒంగోలుకు చెందిన తెలుగుదేశం సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలుకు చెందిన సందీప్, నాయుడుపాలెంకు చెందిన చంద్ర అనే యువకులను తాలుకా పోలీస్​స్టేషన్ వద్దకు తీసుకువచ్చి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

నోట్ల సంగతి సరే.. మరి స్టిక్కర్ మాటేంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.