ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. మున్సిపల్ కమిషనర్ ఆవుల సుధాకర్.. సిబ్బందితో అనుమతులు లేని వెంచర్లలో రాళ్లను తొలగించారు. అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలుదారులు మోసపోవద్దని.. అన్ని అనుమతులు ఉన్న వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలని సూచించారు.
'పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వెంచర్ల నిర్వాహకులు కనీస అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. కొనుగోలుదారులను మభ్యపెట్టి విక్రయాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి' అని కమీషనర్ సుధాకర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అక్రమ లే అవుట్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీచూడండి: