ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామానికి చెందిన చిత్రకారుడు సూర శంకర్ రెడ్డి ఆర్థికస్థోమత లేక పదో తరగతిలోనే చదువు మానేసి తల్లిదండ్రులకు అండగా నిలిచాడు. అయితే చిత్రకారుడిగా రాణించాలని కోరిక మాత్రం ఆయన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తునే ఉండేది. స్నేహితులు చేయూతతో చిత్రలేఖనంలో ఉపాధ్యాయ కోర్సు పూర్తి చేశారు. 1990లో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా ఎంపిక అయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో అతనికి ఉద్యోగం లభించలేదు. అయినా నిరాశ చెందకుండా వ్యవసాయం చేస్తూనే.. నూతన దేవాలయాల్లో రామాయణం, మహాభారతం, చిత్రాలను వేస్తూ మిగతా సమయాల్లో అందమైన చిత్రాలను గీస్తూ తనకంటూ గుర్తింపు పొందాడు. జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు.
ఇదీ చూడండి: