జనవరిలో ప్రాదేశిక పోరుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని చాలామంది టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం కనిపించింది. ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో వారిలో నిరాశ మొదలైంది. విచారణకు నాలుగు వారాల సమయం ఇవ్వడం... ఆ తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్లు కోర్టు విచారణ తర్వాత కొనసాగుతాయా? వాటిని తగ్గిస్తూ కోర్టు తీర్పు ఇస్తుందా? అనే ప్రశ్నలు ఆశావహులను కలవరపెడుతున్నాయి.
ఇదీ చదవండి: సెంట్రల్ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత