ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని పెదగంజాంలోని పురాతన ఆలయంలోని శ్రీభావనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఈ అపురూప దృశ్యాలను సమీప గ్రామప్రజలు భక్తిశ్రద్ధలతో తిలకించి పులకించారు. ప్రత్యేక అభిషేక పూజలు చేశారు.
స్వామివారిని సూర్యకిరణాలు తాకే అపురూప దృశ్యం ఏడాదిలో రెండు పర్యాయాలు ఏర్పడుతుంది. మార్చి మొదటి వారంలో కొన్ని రోజులపాటు, అక్టోబరు మొదటివారంలో కొన్నిరోజులపాటు ఈ అవకాశం ఉంటుందని అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి: