ETV Bharat / state

'జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం' - janasena partry news updates

ప్రకాశం జిల్లా సింగరపల్లిలో మరణించిన జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడేలా ఒత్తిడి తెచ్చిన వారిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అధికార పార్టీ వేధింపులకు గురిచేయడాన్ని తప్పు పట్టారు.

finanancial assistance annoned to dead party men by janasena
కార్యకర్త వెంగయ్య కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
author img

By

Published : Jan 19, 2021, 9:00 PM IST

ప్రకాశం జిల్లా సింగరపల్లి గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ పూర్తి అండగా నిలబడుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ భరోసా ఇచ్చారు. వెంగయ్య కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు తెలిపారు.

గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబును ప్రశ్నించినందుకు.. వెంగయ్య నాయుడి గొంతు నొక్కేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే దూషించడమే కాకుండా, వైకాపా నాయకులు, వాలంటీర్లు కూడా వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడడానికి ఒత్తిడి తీసుకొచ్చిన వారిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: వెంగయ్య మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.